Tag Archives: ramana

‘Ramayya Thandri’ song

ఒక పాట వెనక ఎంతో మంది కృషి ఉంటుంది. దర్శకుడి కల్పన, స్క్రీన్ప్లే రచయిత ఊహ ఒక ఎత్తైతే, సంగీత దర్శకుడి , గీత రచయితల సృజనాత్మకత  మరొకటెత్తు.  

బాపు – రమణ – కే. వీ. మహదేవన్ – కొసరాజు, ఈ నలుగురు కలిసి అందించిన అద్భుతమైన సృష్టి, ‘సంపూర్ణ రామాయణం’ సినిమా లోని ‘రామయ్య తండ్రి’ అనే పాట. ఇక ఈ పాట పాడిన ఘంటసాల మాష్టారు గురించి ఎంత చెప్పిన తక్కువే.

రాముడి వనవాసంలో, గుహుడు తన నావ లో, యేరు దాటించేటప్పుడు, భక్తితో పాడే పాట. మహాకవి కొసరాజు గారు, మొల్ల రామాయణంలో చెప్పిన పద్యాల ఆధారంగా, చరణాలు అల్లి, తనదైన శైలిలో చమత్కారం నింపిన రస గుళిక.

(ఈ విషయాన్నిఈ మధ్యనే, గరికపాటి గారు, ఒక రేడియో షో లో చెప్పారు. కవి ఎక్కడైనా కవే అని. సినిమా కవిత్వం అని చిన్నచూపు చూసేవారికి, ఈ పాట మంచి గుణపాఠం అని, గట్టిగా వక్కాణించారు. )

సంగీతం గురించి రెండు మాటలు. మహదేవన్ గారికి భావం అర్థం చేసుకుని కంపోజ్ చేస్తారని పేరు. ఈ విషయం మనకి ఈ పాటలో  తేట  తెల్లం అవుతుంది (‘ప్రేమ్ నగర్ లో ‘తేట తేట  తెలుగులా’ పాట కూడా సూపర్ అనుకోండి, అది ఇంకో ఆర్టికల్ లో). కొసరాజు గారు మొల్ల పద్యాన్ని మార్చి, రాసిన చరణం లో ‘ఆగు ఆగు బాబు’ లో వడి వడి గా వచ్చే గుహుడికి వాడిన మ్యూజిక్ బిట్,  ‘ఎమువతాదో తంటా…” తర్వాత సీతమ్మ ముసి ముసి నవ్వులకు,  వాడిన మ్యూజిక్ బిట్, మహదేవన్ గారి భావ-బాణీలకు గొప్ప కొలమానాలు.

తెలుగు వారందరు తప్పక విని తరించాల్సిన గీతం ఇది.

Song video

Lyrics

Ramaya Thandri Song Lyrics In Telugu – రామయ తండ్రి లిరిక్స్ తెలుగులో

రామయ తండ్రి ఓ రామయ తండ్రి

మా నోములన్ని పండినాయి రామయ తండ్రి

మా సామివంటె నువ్వేలే రామయ తండ్రి

రామయ తండ్రి ఓ రామయ తండ్రి

మా నోములన్ని పండినాయి రామయ తండ్రి

మా సామివంటె నువ్వేలే రామయ తండ్రి

తాటకిని ఒక్కేటున కూల్చావంట

శివుని విల్లు ఒక దెబ్బకె ఇరిసావంట

తాటకిని ఒక్కేటున కూల్చావంట

శివుని విల్లు ఒక దెబ్బకె ఇరిసావంట

పరశరాముడంతవోణ్ణి పాలదరిమినావంట

ఆ కథలు సెప్పుతుంటె విని ఒళ్లు మరచి పోతుంట

రామయ తండ్రి ఓ రామయ తండ్రి

మా నోములన్ని పండినాయి రామయ తండ్రి

మా సామివంటె నువ్వేలే రామయ తండ్రి

ఆగు బాబు ఆగు

అయ్యా నే వత్తుండ బాబు నే వత్తుండ

అయ్యా నే వత్తుండ బాబు నే వత్తుండ

నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది ఐనాదంట

నాకు తెలుసులే

నా నావ మీద కాలు పెడితె ఏమౌతాదో తంట

నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది ఐనాదంట

నా నావ మీద కాలు పెడితె ఏమౌతాదో తంట

దయజూపి ఒక్కసారి కాళ్లు కడగనీయమంట

మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట

రామయ తండ్రి ఓ రామయ తండ్రి

మా నోములన్ని పండినాయి రామయ తండ్రి

మా సామివంటె నువ్వేలే రామయ తండ్రి

అందరినీ దరిజేర్చు మారాజువే

అద్దరినీ జేర్చమని అడుగుతుండావే

అందరినీ దరిజేర్చు మారాజువే

అద్దరినీ జేర్చమని అడుగుతుండావే

నువు దాటలేక కాదులే రామయ తండ్రి

నువు దాటలేక కాదులే రామయ తండ్రి

నన్ను దయ చూడగ వచ్చావు రామయ తండ్రి

హైలెస్సా లేలో హైలెస్సా

హైలెస్సా లేలో హైలెస్సా

హైలెస్సా లేలో హైలెస్సా

హైలెస్సా లేలో హైలెస్సా